News December 29, 2024

ఖమ్మం: సైబర్ నేరస్థుల వలలో చిక్కకండి: సీపీ సునీల్ దత్

image

ఖమ్మం ప్రజలకు సీపీ సునీల్ దత్ పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్ల మోసాలు అధికంగా పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే పంపి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు పంపాలని ఫోన్ చేస్తే వెంటనే 1930ను సంప్రదించాలని సీపీ కోరారు. 

Similar News

News January 1, 2025

కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి నిత్యకళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో ఈవో రమాదేవి పాల్గొన్నారు.

News January 1, 2025

ఖమ్మం: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ప్రేమ విఫలమే కారణం..?

image

మధిర మండలం కృష్ణాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో << 15026926>>ఇంటర్ విద్యార్థి<<>> సాయివర్ధన్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు ప్రిన్సిపల్ శ్రీనివాస్, వార్డెన్ మోషేను సస్పెండ్ చేశారు. కాగా విద్యార్థి జేబులో ఓ లేఖ దొరికింది. వైరా ACP రెహమాన్‌ లేఖను పరిశీలించి ప్రేమలో విఫలమైనట్లు తెలుస్తోందన్నారు. ‘లవ్ చేయొద్దు రా’ అని సూసైడ్‌కు ముందు తమతో సాయి చెప్పాడని ఫ్రెండ్స్ తెలిపినట్లు సమాచారం.

News January 1, 2025

KMM: న్యూ ఇయర్ రోజే యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

కూసుమంచి మండలం చేగొమ్మ శివారులో న్యూ ఇయర్ రోజే రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న షేక్ పాషా(35) అక్కడికక్కడే మృతి చెందాడు. చేగొమ్మలో స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు పెరికసింగారం గ్రామ వాసి అని స్థానికులు తెలిపారు.