News April 18, 2024
ఖమ్మంలో తొలి నామినేషన్ దాఖలు
ఖమ్మం లోక్సభకు సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని తొలి నామినేషన్ పడింది. 17-ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఆధార్ పార్టీ అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు తమ పార్టీని బలపరిచి ఓటు వేయాలని కోరారు.
Similar News
News November 26, 2024
ఖమ్మం: డిగ్రీ పరీక్షల రీ షెడ్యూల్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.
News November 26, 2024
ఇవాళ, రేపు ప్రజా విజయోత్సవాలు: జిల్లా కలెక్టర్
ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో, ఎల్లుండి ఖమ్మం రూరల్ మద్ది ఎల్లారెడ్డి ఫంక్షన్ హాలులో జయ జయహే ప్రజా పాలన అనే కళాబృందం అలేఖ్య సారథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తమని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News November 25, 2024
ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి : తుమ్మల
ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో వన సమారాధన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించినట్లు గుర్తు చేశారు.