News December 23, 2024
ఖమ్మంలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం
ఖమ్మం జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్‌లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై ఖమ్మంలోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.
Similar News
News December 23, 2024
టీమిండియా ఆశా కిరణం భద్రాచలం అమ్మాయి
U-19 ఆసియా కప్ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గెలుపులో భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించింది. 47 బంతుల్లో 52 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు టోర్నీ అంతా నిలకడగా ఆడి 159 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను ఎంపికైంది. త్రిష ఇలానే ఆడితే మున్ముందు సీనియర్ టీంకు ఎంపికవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News December 23, 2024
ఖమ్మం: సదరం క్యాంపు షెడ్యూల్ విడుదల
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నియోజకవర్గాల వారీగా నిర్వహించే సదరం క్యాంపుల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 23న వైరా, 27న సత్తుపల్లి, జనవరి 2న మధిర, జనవరి 9న ఖమ్మం, జనవరి 17న పాలేరు నియోజకవర్గాల వారి కోసం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ ప్రకటించారు. స్లాట్ బుక్ చేసుకున్న రశీదు, ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరు కావాలన్నారు.
News December 22, 2024
పురుగు మందు సేవించి యువకుడు మృతి
మానసిక వేదనకు గురై పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ గార్ల మం. పినిరెడ్డిగూడెం చెందిన బానోత్ వంశీ అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రియాజ్ పాషా తెలిపారు. వంశీ గతంలో ఒక యువతిని ప్రేమించగా ఆమె కొద్ది రోజుల క్రితం చనిపోయింది. వంశీ మనస్తాపంతో పురుగు మందు సేవించి మృతి చెందాడు. మృతుడి తల్లి భద్రమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.