News April 9, 2025
ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటైతే క్వింటా రూ.25వేలు

మిర్చి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలువగా, రాష్ట్రంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉంది. కానీ ఖమ్మం మిర్చి రైతుల చిరకాల వాంఛ మిర్చి బోర్డు ఏర్పాటుపై సంధిగ్ధo నెలకొంది. ప్రస్తుతం ధరలు క్వింటాకు రూ.13-15 వేల మధ్యే నడుస్తుండగా, బోర్డు ఏర్పాటైతే రూ.20-25 వేలు పలుకుతుందనే ఆశలు వారిలో రేకేత్తిస్తున్నాయ్. నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతన్నలు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News April 19, 2025
బీచ్ ఫెస్టివల్‌లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్‌లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.
News April 19, 2025
NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన MLA రాజేశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుని ని విశ్రాంతి తీసుకుంటున్నాడు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాక్షించారు. నాయకులు పాల్గొన్నారు.
News April 19, 2025
నేడు నాగర్‌కర్నూల్‌కు మంత్రి పొంగులేటి రాక

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజా కన్వెన్షన్ హాల్‌లో జరిగే భూభారతి అవగాహన సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి వస్తున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్ తెలిపారు. సదస్సులో పొంగులేటితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు,MLA రాజేశ్ రెడ్డి, MLC దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని తెలిపారు. వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.