News February 28, 2025

ఖానాపూర్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఖానాపూర్‌ మండలం బీర్నంది గ్రామంలోని రాజీవ్‌ తండాకు చెందిన బానావత్‌ వెంకటేశ్(27) గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ ఉండే వెంకటేశ్ శివరాత్రి పండుగ సందర్భంగా గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చాడు. భార్య మీనాక్షితో గొడవ కావడంతో వెంకటేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Similar News

News March 1, 2025

రూల్స్ అతిక్రమిస్తే జరిమానా: సీపీ రాజశేఖరబాబు

image

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,000 జరిమానా, 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 డి ప్రకారం ఈ మేరకు రూ.1,000 జరిమానా విధిస్తామని, బైక్‌లు నడిపేవారు హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని సూచించారు.

News March 1, 2025

సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతాం అంటూ కాల్ చేసే సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా SMS వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్‌తో సైబర్ మోసగాళ్ళు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి మిమ్మలను నమ్మించి మోసం చేస్తారని అన్నారు.

News March 1, 2025

WPL: టేబుల్ టాప్‌లో ఢిల్లీ

image

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.

error: Content is protected !!