News March 28, 2025

ఖైరతాబాద్ : ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ

image

జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి ఈ నెల 31 వరకు దాదాపు విశ్రాంతి ఉండేలాగా కనిపించడంలేదు. ఆయా సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్తి పన్ను వడ్డీపై ఇచ్చే 90% రాయితీని ఉపయోగించుకోవాలని గ్రేటర్ కమిషనర్ ఇలంబర్తి నగర ప్రజలకు సూచించారు.

Similar News

News April 3, 2025

HYD: సెక్రటేరియట్ ముందు ఇదీ పరిస్థితి 

image

భారీ వర్షం కారణంగా రహదారులపై వర్షపు నీరునిలిచిపోయింది. తెలంగాణ సచివాలయం వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అటు ఖైరతాబాద్ KCP జంక్షన్, సోమాజిగూడలో ప్రధాన రహదారులపై చెట్లు నేలకొరిగాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహననదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అత్యవసరం అయితేనే బయటకురండి. SHARE IT

News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

News April 3, 2025

HYDలో ‘అతిథి దేవోభవ’ కరవు!

image

అతిథి దైవ సమానం. కానీ, తాజా ఘటనతో పరువు పోయింది. జర్మనీ యువతికి HYD చూపిస్తానని నమ్మించిన యువకుడు అత్యాచారం చేసి, ఆమె జీవితంలో మాయనిమచ్చను మిగిల్చాడు. గతంలో ఓ ఫారినర్‌కు వ్యాపారి రూ.100కు ఒక్క అరటి పండు అంటగట్టాడు. ఇది అన్యాయమని ఆ టూరిస్ట్ వీడియో వైరల్ చేశాడు. వాస్తవానికి HYD మతసామరస్యానికి నిలువుటద్దం. గొప్ప వారసత్వ సంపద ఉన్న నగరం. లక్షల మందికి ఉపాధినిస్తోంది. అలాంటి చోట ‘అతిథి దేవోభవ’ ఆచరించండి.

error: Content is protected !!