News March 24, 2025
ఖైరతాబాద్: కారు కడిగితే రూ.10,000 కట్టాల్సిందేనా..?

అదేంటి మా కారు మేము కడిగితే రూ.10వేలు ఎందుకు కట్టాలి అని అనుకుంటారు. మీరు కాదులెండి. జలమండలి సరఫరా చేసే నీటితో విచ్చలవిడిగా కార్లు కడిగిన వారికి ఈ భారీ జరిమానా విధించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సరఫరా చేస్తున్న నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయినా మంచినీటితో కారును ఎందుకు కడగాలి? అనేది మనం ఆలోచించాలి.
Similar News
News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
News March 26, 2025
HYDలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. RAIDS

HYDలో వ్యభిచార ముఠాలకు పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో బంగ్లా యువతితో వ్యభిచారం చేయించడం గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన కార్తీక్, ఓ కస్టమర్, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు పంపి కస్టమర్లను ఆకర్శిస్తున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోనూ ఉగాండా యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు.
News March 26, 2025
రూ.2 కోట్లు.. సచివాలయం చెల్లించాల్సిన ఆస్తి పన్ను

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఘనంగా, గొప్పగా నిర్మించిన ప్రభుత్వం ఆ భవనానికి సంబంధించి ఆస్తి పన్ను ఇంకా చెల్లించలేదు. మహానగర వ్యాప్తంగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్న అధికారులకు పెండింగ్ బిల్లు జాబితాలో రాష్ట్ర సచివాలయం కనిపించింది. దాదాపు రూ.2 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 31లోపు ఈ మొత్తాన్ని ఎలా రాబట్టాలని గ్రేటర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు.