News March 29, 2025

ఖైరతాబాద్: సిటీలో 20% వృథా అవుతున్న నీరు

image

వేసవిలో నగరంలో నీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే జలమండలి నగర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న నీటిలో సుమారు 20% వృథా అవుతోంది. అంటే దాదాపు 95 మిలియన్ లీటర్లు (3.5 మిలియన్ గ్యాలన్లు) వేస్టేజ్ అవుతోంది. పైప్‌లైన్ల లీకేజీలు, అనధికార కనెక్షన్ల కారణంగా ఈ నీరు ఇలా అవుతోందని జలమండలి అధికారులు చెబుతున్నారు. 2% సరఫరా లోపం కాగా.. మరో 18% నీటి పంపిణీలో ఉన్న లోపాల కారణంగా వేస్ట్ అవుతోంది.

Similar News

News April 2, 2025

HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అత్యాచారం

image

జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. సోమవారం సా. 6 గంటలకు యువతి, ఆమె స్నేహితుడిని అస్లాం కారులో ఎక్కించుకుని యాకుత్‌పురా, చార్మినార్‌లో తిప్పాడు. సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్‌ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్‌ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి <<15963281>>ఆమెపై<<>> అత్యాచారం చేశాడు ప్రబుద్ధుడు.

News April 2, 2025

HYD: CM రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ

image

శ్రీరామనవమి శోభాయాత్రకు ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని BJP ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 15 ఏళ్లుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు శబ్ద నియంత్రణ పేరుతో ఆంక్షలు వేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర మతాలకు ఇలా ఆంక్షలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. యాత్రను నిర్బంధం లేకుండా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు.

News April 1, 2025

కేసీఆర్‌తో వరంగల్ బీఆర్ఎస్ నేతల భేటీ

image

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వారంతా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తామని వారంతా ముక్తకంఠంతో పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు.

error: Content is protected !!