News March 22, 2025

ఖైరతాబాద్: స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఇలాంబర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీంట్లో భాగంగా ఇటీవల బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,101.21 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నగరంలో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులు, పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు.

Similar News

News March 27, 2025

HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

image

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.

News March 27, 2025

మేయర్ కలిసిన ఇండియానాలో పోలో బృందం

image

అమెరికాకు చెందిన ఇండియానాలో పోలో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యింది. 2010లో ఇండియనా స్టేట్ పలు అంశాలపై సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియనా ప్రతినిధులు మేయర్‌కు వివరించారు.

News March 27, 2025

HYDలో నేడు డబుల్ ధమాకా

image

HYDలో IPL సంబరాలు నేడు అంబరాన్ని అంటనున్నాయి. వినోదానికి ఉర్రూతలూగించే సంగీతం జతకానుంది. నేడు ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు SRH VS LSG మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో తమన్‌ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ఉంది. ఇంకేముంది క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు. హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ తగ్గేదే లే అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

error: Content is protected !!