News February 25, 2025

గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

గంజాయి కేసులో ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 మే 20వ తేదీన అనకాపల్లి టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు సోమవారం శిక్షను విధించిందని ఎస్పీ తెలిపారు.

Similar News

News February 25, 2025

విజయనగరం: బొత్సపై స్పీకర్ అయ్యన్న మండిపాటు

image

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో స్పీకర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు సభలో YCP ప్రవర్తన పై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరును జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా? అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా చేసేది తప్పని చెప్పలేదని ఫైర్ అయ్యారు.

News February 25, 2025

ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం ఎంతమందికి తెలుసు? నేపాల్‌లో ‘ప్రభాస్’ అనే ఊరు ఉంది. ఓ తెలుగు మోటో వ్లాగర్ నేపాల్ పర్యటనలో ఉండగా అతనికి ఈ విలేజ్ కనిపించింది. దీంతో డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ వీడియో షేర్ చేశాడు. అయితే, ప్రభాస్‌కు ఈ ఊరికీ ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కాగా, సచిన్, కోహ్లీల పేరిట రైల్వే స్టేషన్లు ఉన్న విషయం తెలిసిందే.

News February 25, 2025

ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.. స్పందించిన హోం మంత్రి

image

అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడాం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని, గుండాల కోనకు వెళ్లే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలి’ అని అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!