News April 4, 2025

గంజాయి సాగు, రవాణా అరికట్టాలి: ఎస్పీ

image

స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. శుక్రవారం పాడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి కేసుల్లో పరాయిలో ఉన్న ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు విస్తృతంగా వినియోగించి, గంజాయి సాగు, రవాణా అరికట్టాలని సూచించారు. డైనమిక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News December 14, 2025

ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. త్వరలో పెళ్లి

image

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2019లో మెహర్‌ జెసియాతో విడాకుల తర్వాత గాబ్రియెల్లాతో అర్జున్‌ ప్రేమ బంధం కొనసాగుతోంది. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాబ్రియెల్లా తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో, అర్జున్‌ ‘భగవంత్‌ కేసరి’లో మెప్పించారు.

News December 14, 2025

GNT: సీఎం రాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

CM చంద్రబాబు ఈ నెల 16న మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీవకుల్ జిందాల్ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పోలీస్ నియామకం చేపట్టి, ఎంపికైన 6,100 అభ్యర్థులకు మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్‌లో నియామక పత్రాలు అందించనున్నారు. సీఎం స్వయంగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు.

News December 14, 2025

పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది: ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలియజేశారు. ఓటు వేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు పోలీసు సిబ్బంది తమ వంతుగా సహాయ సహకారాలు అందించారన్నారు. వృద్ధులు ఓటు వేయడానికి రాగా వీల్ చైర్లలో కూర్చోబెట్టుకొని పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహాయ సహకారాల పట్ల అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారన్నారు.