News October 22, 2024

గండికోట లోగో, ట్యాగ్ లైన్ అధికారిక ఆవిష్కరణ

image

జమ్మలమడుగు మండలం ప్రసిద్ధి పర్యాటక కేంద్రం గండికోట వారసత్వం, సంస్కృతి ప్రతిబింబించే విధంగా సృజనాత్మకమైన లోగో, ట్యాగ్ లైన్‌ను జిల్లా కలెక్టర్ అదితి సింగ్, జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి ఏ సురేశ్ కుమార్ సోమవారం అధికారికంగా ప్రకటన చేశారు. లోగో డిజైన్ పోటీల్లో గెలుపొందిన తుషార్ దివాన్కర్‌ను అభినందించారు. ఈ ప్రయత్నం గండికోటలో పర్యాటకం ప్రత్యేక అనుభవాలను హైలెట్ చేయడమే అన్నారు.

Similar News

News January 21, 2025

సిద్దవటం: కిడ్నీ వ్యాధితో ఏడేళ్ల బాలుడి మృతి

image

కడప జిల్లా సిద్దవటం మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన రాజు, రామతులసి దంపతుల కుమారుడు మహేంద్రవర్మ(7) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రామక్రిష్ణాపురానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ఎంపీపీ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నేటి ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News January 21, 2025

కడప: నేటి నుంచి YVU పీజీ పరీక్షలు

image

కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ అనుబంధ కళాశాలల MA, M.Com, M.Sc& M.P.Ed. మొదటి సెమిస్టర్ పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలు 21, 23, 25, 27, 29, 31 తేదీలలో ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

News January 21, 2025

కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష

image

వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.