News December 1, 2024

గండికోటలో టోల్ వసూళ్లు దారుణం: DYFI

image

గండికోటకు వచ్చే పర్యాటకుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం దారుణమని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ అన్నారు. కడప DYFI జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి దాదాపు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే మరోవైపు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

Similar News

News January 14, 2025

పులివెందులలో జోరుగా కోళ్ల పందేలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని పులివెందులలో తొలిసారి జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని ఉలిమెల్ల, మండలంలోని ఈ.కొత్తపల్లి, ఎర్రిపల్లె తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో తొలిరోజే రూ.2 కోట్లకు పందేలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో 8 చోట్ల బరులు ఏర్పాటు చేయగా.. లింగాల మండలంలోనే దాదాపు రూ. 50 లక్షలకు పందేలు జరిగినట్లు సమాచారం.

News January 14, 2025

కడప: గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్ షాక్

image

సంక్రాంతితో కడప జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్దలు పిండివంటల తయారీలో బిజీగా ఉంటే, పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడపలోని శాంతి నగర్‌కు చెందిన ఓ బాలుడు సోమవారం గాలిపటం ఎగురేశాడు. విద్యుత్ వైర్లకు తగలడంతో తప్పించేందుకు గట్టిగా లాగగా విద్యుత్ వైరు బాలుడిపై పడి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు అక్కడినుంచి మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

News January 14, 2025

కడప: 15న జరగాల్సిన UGC – NET పరీక్ష వాయిదా

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జనవరి 15న జరగాల్సిన UGC-NET డిసెంబర్ 2024 పరీక్షను సంక్రాంతి, పొంగల్ పండుగ సందర్భంగా వాయిదా వేశారు. 16 నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్ www.nta.ac.in ను సందర్శించాలని ఎన్టీఏ (ఎగ్జామ్స్) డైరెక్టర్ రాజేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కొత్త పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.