News April 5, 2025

గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి మృతి

image

గండేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి బాడవుల కేదార్ మణికంఠ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం..ఏలూరు ముదినేపల్లికి చెందిన మణికంఠ రాజమండ్రికి చెందిన విష్ణువర్ధన్‌తో కలిసి ధర్మవరంలో బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా బైకు ఢీకొట్టిన ఘటనలో చనిపోయాడన్నారు.

Similar News

News April 6, 2025

సికింద్రాబాద్: రైలులోని వాష్‌రూమ్‌లో అత్యాచారం (UPDATE)

image

రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్‌రూమ్‌లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి ఫొటోలు బయటకొచ్చాయి. HYDను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే <<15997705>>సంతోష్‌(బిహార్ వాసి)<<>> అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై పూర్తి నివేదిక పంపాలని తాజాగా DGP, RPF డీజీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కార్‌ కోరారు.

లోకేశ్ సొంత ఇలాకాలో ‘గంజాయి’: YCP

image

AP: మంత్రి లోకేశ్ సొంత ఇలాకా మంగళగిరిలో గంజాయి పట్టుబడిందని YCP ట్వీట్ చేసింది. ‘కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.2kgs గంజాయి, 8.71gms డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చోట పట్టుకున్న గంజాయే ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉందో? 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని లోకేశ్ బీరాలు పలికారు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదా’ అని విమర్శించింది.

error: Content is protected !!