News June 4, 2024

గజ్వేల్ సెగ్మెంట్‌లో బీజేపీ ఆధిక్యం

image

గజ్వేల్ అసెంబ్లీ సిగ్మెంట్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. మొదటి రౌండ్‌లో బీజేపీకి 3728 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2749 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు 2543 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 979 ఓట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయింది.

Similar News

News October 1, 2024

MDK: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.

News October 1, 2024

MDK: డీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులు

image

సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ అభ్యర్థులు సత్తా చాటారు. చిలపిచెడ్ మండలం రహీంగూడకు చెందిన జూల లింగం(SGT), అక్కన్నపేటకు చెందిన జంగం నవీన్( ఫిజికల్ సైన్స్) మెదక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. హత్నూర మండలం కాసాలకు చెందిన పన్యాల సాయికృష్ణ SGT సాంఘిక శాస్త్రంలో జిల్లాలోనే 2వ ర్యాంక్ సాధించగా.. అక్కన్నపేటకు చెందిన శ్రీధర్ గౌడ్ అనే యువకుడు(సాంఘిక శాస్త్రం) ఆరో ర్యాంకు సాధించారు.

News October 1, 2024

సంగారెడ్డి: సెల్ ఫోన్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ

image

సెల్ ఫోన్ రిపేరింగ్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లు వయసున్న వారు అర్హులని చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి అక్టోబర్ 14 నుంచి నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.