News January 25, 2025
గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: BHPL కలెక్టర్

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని డా బీఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, తదుపరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
Similar News
News March 14, 2025
నంద్యాల: బంగారు పతకాలు సాధించిన నేహా

నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరుకు చెందిన నేహాకు ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు లభించినట్లు కరెస్పాండెంట్ అబ్దుల్ సలీం తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన 55 కేజీలు, 30 కేజీల పోటీల్లో 2 బంగారు పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేహాకు పలువురు అభినందనలు తెలిపారు. మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు.
News March 14, 2025
కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ తుది పరీక్ష ఫలితాలలో కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన వంశీ కృష్ణారెడ్డి అనే వ్యక్తి 199వ ర్యాంకు సాధించాడు. దీంతో ఇన్కమ్ టాక్స్ ఉద్యోగానికి ఎంపికయ్యాడని తండ్రి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కీ.శే వెంకటరెడ్డికి ముని మనవడు కావడం విశేషం. కృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
News March 14, 2025
హోలి: ఈ జాగ్రత్తలు పాటించండి

హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.