News August 17, 2024
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో ప్రజాప్రతినిధులతో గణేష్ ఉత్సవ కమిటీతో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Similar News
News November 27, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
News November 26, 2024
పెద్దపల్లి: దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్న పూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పని చేసే వంట మనిషి నగ్న పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ బాలికతో చెప్పింది. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులను ఆశ్రయించగా సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 26, 2024
కోరుట్ల: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్
NZB జిల్లా న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. NZBకు చెందిన కాంత్రికుమార్‌కు కోరుట్లకు చెందిన మానసతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్ద కూతురు నేహశ్రీకి మానసిక ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది కూతురితో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.