News March 26, 2025
గద్వాల POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా గద్వాల డీసీసీ చీఫ్‌గా నల్లారెడ్డి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ ఆశావహుడిగా ఉన్నా మరోసారి నల్లారెడ్డికే పదవి ఇస్తారని టాక్.
Similar News
News April 1, 2025
అమరచింత: రాత్రి వేళైనా కొనసాగుతున్న మున్సిపల్ వసూళ్లు

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో సోమవారం రాత్రి 8 గంటలైనా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ పన్నును వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు లబ్ధిదారులు పండుగ పూట, రాత్రయినా వసూలు చేస్తున్నారని వాపోయారు. అయినా ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని తెలపడంతో తప్పని పరిస్థితిలో చెల్లిస్తున్నట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు.
News April 1, 2025
కామారెడ్డి: WOW.. రాయిని చీల్చి.. వృక్షంగా ఎదిగి!

ప్రకృతి అంతులేని శక్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం నిజాంసాగర్ శివార్లో కనిపించింది. నిశ్చలంగా కనిపించే ఒక పెద్ద బండరాయిని చీల్చుకుంటూ ఓ మొక్క మొలకెత్తి, నేడు ఎదిగి వృక్షంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఈ రాయిని చీల్చుకుని ఎదిగిన వృక్షం మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. అడ్డంకులు ఎంత పెద్దగా ఉన్నా, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనే స్పూర్తినిస్తోంది.
News April 1, 2025
గద్వాల: ‘అంబేడ్కర్ ఆలోచన పండగను విజయవంతం చేయాలి’

అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బుడకల ప్రకాశ్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ చౌరస్తాలో కరపత్రాలను విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీన అంబేడ్కర్ ఆలోచన పండుగను నిర్వహిస్తున్నామన్నారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో 10 గంటలకు జరిగే పండగకు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కరిస్ట్‌లు తరలిరావాలని కోరారు.