News April 5, 2025

గద్వాల: అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేద్దాం: నాయకులు

image

గద్వాల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 12న నిర్వహించనున్న అంబేద్కర్ ఆలోచన పండుగ ర్యాలీ సభ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ, శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం, వారి విగ్రహం ఎదుట అంబేడ్కర్ ఆలోచన పండుగకు సంబంధించిన గోడపత్రికలను ప్రజాసంఘాల నాయకులు, బోధన సిబ్బంది, కార్యకర్తలు సంయుక్తంగా ఆవిష్కరించారు.

Similar News

News April 7, 2025

బెట్టింగ్.. నలుగురి అరెస్ట్: ADB SP

image

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.

News April 7, 2025

MNCL:GOOD NEWS.. 7 నుంచి కంటి పరీక్షలు

image

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపుచిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డా.హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్బీఎస్కే బృందాలతో 37, 920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

News April 7, 2025

నిర్మల్: మానవత్వం చాటుకున్న RTC కండక్టర్

image

ఆర్టీసీ బస్సులో దొరికిన పర్సును అందజేసి నిజాయితీని చాటుకున్నాడు కండక్టర్ నారాయణ. ఆదివారం నిర్మల్ నుంచి భైంసా వెళ్లే ఆర్టీసీ బస్సులో రాంపూర్ వరకు ప్రయాణించిన ఓ మహిళ బస్సులోనే పర్సును మరిచిపోయారు. పర్సులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెని పిలిపించి రూ.10 వేల నగదు, పర్సును అందజేశారు. డిపో మేనేజర్ పండరి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ పలువురు ఆయనను అభినందించారు.

error: Content is protected !!