News March 20, 2025
గద్వాల: ఇసుక తవ్వకాలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

గద్వాల జిల్లాలో ఇసుక సౌలభ్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం రాజోలి మండల పరిధిలోని తుమ్మిళ్లలో గుర్తించబడిన ఇసుక డీ-సిల్టేషన్ ప్రదేశాన్ని పరిశీలించారు. భౌగోళిక పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఇసుక తవ్వకాలు,భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తవ్వకాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 15, 2025
T20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్ ఔట్

సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచులకు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు మ్యాచులకు ఆయన అందుబాటులో ఉండరని తెలిపింది. అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది. 5 మ్యాచుల T20 సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచులు జరగగా IND 2, SA 1 గెలిచాయి. ఈ నెల 17న 4th, 19న 5th టీ20 జరగనుంది.
News December 15, 2025
‘తీరప్రాంత రైతులకు వరం.. సముద్రపు పాచి సాగు’

సముద్ర తీర ప్రాంతాల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, రైతుల జీవనోపాధికి సముద్రపు పాచి, ఆస్పరాగస్ సాగు ఎంతో కీలకమని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వీటి సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. లవణ భరిత నేలల్లో పెరిగే హలో ఫైటు రకానికి చెందిన సముద్ర ఆస్పరాగస్ ఉప్పునీటి నేలల్లో సులభంగా పెరుగుతుందన్నారు. దీంతో తీరప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.
News December 15, 2025
యాదాద్రి: నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పు

యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో నిత్య కైంకర్యాల సమయవేళల్లో మార్పు చేశారు. ఉదయం 3:30లకు సుప్రభాతం, 4:00 నుంచి 4:30 వరకు తిరువారాధన, 4:30 నుంచి 5 వరకు తిరుప్పావై సేవా కాలం, 5 గంటల నుంచి 6 గంటల వరకు నివేదన చాత్మర, 6 గంటల నుంచి 7 గంటల వరకు నిజాబీ అభిషేకం, 7 గంటల నుంచి 7:45 వరకు సహస్రనామార్చన, 7:45 తర్వాత ధర్మ దర్శనాలు ప్రారంభమవుతాయి.


