News April 1, 2025
గద్వాల: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ సంతోష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 3, 2025
విదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు.. అమెరికన్లపై భారం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లతో ఆ దేశ ప్రజలపై భారం పడనుంది. అగ్రరాజ్యం కాఫీ గింజల నుంచి కార్ల వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజా టారిఫ్‌లతో కార్ల ధరలు సగటున 2,500 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే, USకు దుస్తులు ఎగుమతి చేస్తున్న చైనా, వియత్నాం, బంగ్లాపైనా టారిఫ్‌లు పెంచడంతో వాటి ధరలూ పెరగనున్నాయి. మద్యం, ఇంధనం, కాఫీ గింజలు, కొన్నిరకాల పండ్ల ధరలు ప్రియం కానున్నాయి.
News April 3, 2025
టారిఫ్స్ పెంచేందుకు కారణమిదే..

అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ పెంచడంతో ఆ దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు అగ్రరాజ్యానికి వస్తువులను ఎగుమతి చేయడం తగ్గిస్తాయి. ఫలితంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పెరుగుతాయి. అక్కడి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. కొన్నేళ్ల వరకు ధరలు పెరిగినా ట్రంప్ నిర్ణయం దీర్ఘకాలంలో ఆ దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకుల మాట.
News April 3, 2025
2026 T20WC వరకు టైట్ షెడ్యూల్

ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానున్నారు. 2026 T20 WC వరకు టైట్ షెడ్యూల్ ఖరారైంది. జూన్-జులైలో ENGతో 5 టెస్టులు, SEPలో ఆసియా కప్, OCTలో వెస్టిండీస్‌తో 2 టెస్టులు, OCT-NOVలో AUSతో 3 ODI & 5 T20I, NOV-DECలో SAతో 2 Test, 3 ODI & 5 T20I, JANలో NZతో 3 ODI & 5 T20I, FEB-MARలో T20 వరల్డ్ కప్ ఆడనున్నారు.