News March 7, 2025
గద్వాల: ఏడు మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

జోగులాంబ గద్వాల జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. జోగులాంబ గద్వాల జోన్ DIG ఎల్.ఎస్. చౌహన్ అందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. ఈ సందర్భంగా DIG ఎల్.ఎస్. చౌహన్ పదోన్నతి పొందిన పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News March 9, 2025
ద్వారకానగర్‌లో యువతి ఆత్మహత్య

ద్వారకానగర్‌లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 9, 2025
గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 9, 2025
గోదావరిలో భారీగా పడిపోయిన నీటిమట్టం

జీవనదిగా పేరు గాంచిన పవిత్ర గోదావరి అడుగంటిపోతోంది. మార్చిలోనే ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. భద్రాచలం వద్ద నది నీటిమట్టం గడిచిన ఐదు రోజులుగా కనిష్ఠంగా 2.6 అడుగులకు పడిపోయింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎగువన కురిసే వానలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడం పరిపాటి. భద్రాచలానికి ఎగువన నీటి స్టోరేజ్ లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని భావిస్తున్నారు.