News February 22, 2025
గద్వాల: కరెంట్ షాక్‌తో జూనియర్ అసిస్టెంట్ మృతి

కరెంట్ షాక్‌తో గట్టు మండలంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని గంగిమాన్‌దొడ్డికి చెందిన బోయ రాము(39) ధరూర్ తహశీల్దారు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన కొత్త ఇంటికి నీళ్లు పట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురై మృతిచెందారు. కుటుంబంలో యజమానిని కోల్పోవడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
Similar News
News February 23, 2025
SRD: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో శిక్షణ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News February 23, 2025
హుస్నాబాద్: తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ ఉదంతం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో శనివారం జరిగింది. వ్యవసాయంలో నష్టం రావడంతో బోనాల శ్రీనివాస్ (46) అనే రైతు పురుగు మందు సేవించి శుక్రవారం ఆత్మహత్యయత్నం చేయగా, హనుమకొండలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీనివాస్‌కు ఇరువురు కుమార్తెలు ఉండడంతో అందులో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టింది.
News February 23, 2025
NZB: జీవితంపై విరక్తి చెందిన మహిళ మృతి

నవీపేట్ మండలం సిరన్ పల్లి వడ్డెర కాలనీకి చెందిన మల్లవ్వ(40) గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో భర్తతో గొడవపడేది. ఈ నెల 14 వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పొలంలో ఉన్న బావి నుంచి దుర్వాసన రావడంతో శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీపేట ఎస్ఐ మృతదేహాన్ని బావి నుంచి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.