News April 4, 2025
గద్వాల: చికిత్స పొందుతూ మృతి

స్వచ్ఛంద సంస్థలో పని చేస్తూ మహిళకు ఆపద వచ్చిందంటే సామాజిక సేవలో ముందుడే జయభారతి గురువారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకొని ప్రమాదం జరగగా మెరుగైన చికిత్స కోసం అపోల ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News April 8, 2025
సొంతింటి కలను నెరవేర్చిన సీఎం

ఓ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తిరుచానూరు పర్యనకు జనవరి 12న వచ్చిన సీఎంను లీలావతి, శరవణ దంపతులు కలిశారు. తమకు ఇంటితో పాటు, ఆర్థిక సహాయం చేయాలని సీఎంను వేడుకున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ లీలావతి దంపతులకు రూ.లక్ష చెక్కుతో, ఇంటిని మంజూరు చేశారు.
News April 8, 2025
కాకినాడ: భారత్-అమెరికా సైనిక విన్యాసాలకు బందోబస్తు

కాకినాడ రూరల్ తీర ప్రాంతం వద్ద మంగళవారం ఉదయం నుంచి 13వ తేదీ వరకు భారత్-అమెరికా వాయుసేన విన్యాసాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నావెల్ ఎన్క్లేవ్ వద్ద అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్యకృష్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 130 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 13వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్ళింపు ఉంటుందన్నారు.
News April 8, 2025
అనకాపల్లి: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. కశింకోట పెట్రోల్ బంక్ వద్ద 2018 జూన్ 8న లారీ డ్రైవర్ శర్వన్ కుమార్ గణపతి, మృతుడు మునిరాజు మధ్య వివాదం జరిగింది. తరువాత మునిరాజు పెట్రోల్ బంక్ సమీపంలో విశ్రమిస్తుండగా శర్వన్ కుమార్ రాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మునిరాజు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ జూన్ 9న మృతి చెందినట్లు తెలిపారు.