News April 4, 2025
గద్వాల జిల్లా కలెక్టర్ ముఖ్య గమనిక

LRS స్కీం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 30 వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ.ఎం.సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ GO No 182ను జారీ చేశారని పేర్కొన్నారు.
Similar News
News April 11, 2025
9,970 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తులు

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని RRB ప్రకటించింది. టెన్త్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ITI లేదా ఇంజినీరింగ్‌లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. మే 11 చివరి తేదీ.
వెబ్‌సైట్: www.indianrailways.gov.in
News April 11, 2025
నెల్లూరు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 53,200 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 28,176 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 25,024 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
తిరుపతి: 62 వేల మంది విద్యార్థుల ఎదురుచూపు

తిరుపతి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 86 పరీక్షా కేంద్రాల్లో 62,760 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 32, 213 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 30,548 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.