News April 18, 2025
గద్వాల: ‘’జై భీమ్’ అని 1,46,385 సార్లు రాస్తే రూ.5016 బహుమతి?’

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వినూత్న కార్యక్రమం చేపట్టారు. భారత రాజ్యాంగంలో 1,46,385 పదాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా 1,46,385 సార్లు జై భీమ్.. జై భీమ్.. అని రాస్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎవరైతే మంచి చేతి రాతతోని రాస్తారో వారికి రూ.5,016 బహుమతిగా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ రాజోలి మండలాధ్యక్షుడు పులిపాటి దస్తగిరి ఒక ప్రకటనలో అన్నారు.
Similar News
News April 19, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం: కలెక్టర్

భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూ భారతిపై శనివారం వర్ని , రుద్రూర్ రైతు వేదికలలో అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు.
News April 19, 2025
బాపట్ల: ఉద్యోగాల పేరిట రూ.1.5కోట్ల వసూలు.. మోసగాడి అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసి రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసిన వ్యక్తిని తెనాలి త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమరావతి కాలనీకి చెందిన తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్‌లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.1.5 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
News April 19, 2025
టైట్ డ్రెస్‌లు వేసుకుంటే..

టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల నడుము, కాళ్ల వద్ద రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి వాపు రావడం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతాయి. పలు రకాలైన చర్మ సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాల సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.