News February 7, 2025

గద్వాల: ట్రాన్స్ జెండర్‌‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

image

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 7, 2025

RTC జేఏసీని చర్చలకు పిలిచిన కార్మిక శాఖ

image

TGSRTC జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఈ నెల 10న చర్చల్లో పాల్గొనాలని పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.

News February 7, 2025

ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదు: సీఎం

image

TG: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని CM రేవంత్ వెల్లడించారు. ‘క్యాబినెట్‌లో ఎవరుండాలనే దానిపై అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాం. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యం. పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎన్నడూ ఉండవు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు.

News February 7, 2025

యాదాద్రి: అడవి దున్న మృతి..

image

కొద్దిరోజులుగా జిల్లాలో హల్‌చల్ సృష్టించిన <<15388923>>అడవి దున్న<<>> మరణించింది. కొద్ది గంటల క్రితమే చాకచాక్యంగా దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్న అటవీ శాఖ అధికారులు అది మృతి చెందినట్లు తెలిపారు. కాగా, రెండు రోజుల నుంచి విపరీతంగా తిరగడంతో <<15386379>>దున్న <<>>అనారోగ్యానికి గురై చనిపోయిందని జిల్లా అధికారి పద్మజారాణి పేర్కొన్నారు. ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా పంచనామ నిర్వహించనున్నట్లు చెప్పారు.

error: Content is protected !!