News February 8, 2025

గద్వాల: ‘పెండింగ్‌ ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలి’

image

పెండింగ్‌లో ఉన్న ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ నారాయణ తహశీల్దార్లకు ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టర్ కలెక్టరేట్లోని హాల్‌లో మండలాల తహశీల్దార్లతో ధరణి, మీ సేవ కేంద్రాలలో దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాల వివరాలు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు నిర్దేశించిన కాలంలో చేయాలని సూచించారు.

Similar News

News February 9, 2025

ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

image

కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

News February 9, 2025

రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

image

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.

News February 9, 2025

జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.

error: Content is protected !!