News April 23, 2025
గద్వాల: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. బుధవారం కేటీ.దొడ్డి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని, చట్టం, అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
Similar News
News April 23, 2025
నేడు అర్ధరాత్రి ఓటీటీలోకి ‘ఎంపురాన్’

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.280 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగానూ రికార్డు సృష్టించింది.
News April 23, 2025
ట్రెండింగ్: ఇషాన్ కిషన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

IPL: MIతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే ఔట్ అయిన ఇషాన్ కిషన్‌పై SMలో ఫిక్సింగ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బ్యాట్‌కు బంతి తగలకుండానే ఔట్ అయినట్లు భావించి పెవిలియన్‌కు <<16194207>>చేరడమే<<>> దీనికి కారణం. బౌలర్, కీపర్, ఫీల్డర్లెవరూ అప్పీల్ చేయకుండానే క్రీజు నుంచి వెళ్లిపోవడంపై క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. BCCI తిరిగి ఇతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడం దండగ అని సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.
News April 23, 2025
‘పేదరికం నుంచి బయటకి వచ్చేలా అవగాహన కల్పించాలి’

బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పి4 అమలు తీరుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం, వారి భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికతో అవగాహన కల్పించడం ముఖ్యమని కలెక్టర్ చెప్పారు.