News April 19, 2025
గద్వాల: ‘మంత్రి రాకతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు’

గద్వాల జిల్లాలో భూభారతి అవగాహన కార్యక్రమంలో ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో అధికారులు గుంతలు ఉన్న ప్రధాన రోడ్డులకు మట్టి వేసి చేతులు దులుపుకున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లు వల్ల జిల్లా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా అధికారులు మాత్రం స్పందించలేదని, మంత్రి వస్తున్న నేపథ్యంలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.
Similar News
News April 20, 2025
IPL: టాస్ గెలిచిన ముంబై

వాంఖడేలో MIvsCSK మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో గత నెల 23న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఈరోజు పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఐపీఎల్ ప్రియుల్లో నెలకొంది.
జట్లు:
CSK: రషీద్, రచిన్, మాత్రే, శంకర్, దూబే, జడ్డూ, ఓవర్టన్, ధోనీ, నూర్, ఖలీల్, పతిరణ
MI: రికిల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, పాండ్య, నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, అశ్వని
News April 20, 2025
కొమురవెల్లి మల్లికార్జునుడిని దర్శించుకున్న బక్కి వెంకటయ్య

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
News April 20, 2025
ఆ సినిమాల్లో యాక్టింగ్ చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది: సామ్

తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు పెద్ద పీట వేస్తారని హీరోయిన్ సమంత అన్నారు. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో అంతా కొత్తవారే నటించారని చెప్పారు. నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదన్నారు. తాను నటించిన మొదటి రెండు చిత్రాల్లో యాక్టింగ్ చూస్తే ఇప్పటికీ సిగ్గుగా అనిపిస్తుందని సామ్ తెలిపారు. కాగా ‘ఏమాయ చేసావె’తో ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.