News November 18, 2024

గద్వాల: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

image

గద్వాల జిల్లాలో పంచాయితీరాజ్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఇటిక్యాల మండల పంచాయితీరాజ్ ఏఈ పాండురంగారావు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈక్రమంలో నేడు ఏఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2024

BREAKING: ఆమనగల్లులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మండలంలోని మంగళ్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నకేశవ కాలానికి చెందిన వరికుప్పల యాదయ్యతో పాటు మరో వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

News November 18, 2024

MBNR: “పాలమూరు యూనివర్సిటీలో SPORTS’

image

పాలమూరు యూనివర్సిటీలో ‘నేషనల్ ఫార్మసీ వీక్’ సందర్భంగా సోమవారం కాలేజ్ ఆఫ్ పారమెడికల్ సైన్స్ విద్యార్థులకు ప్రిన్సిపల్ నూర్జహాన్, ప్రభాకర్ రెడ్డి, యూనివర్సిటీ పీడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆట పోటీలు నిర్వహించారు. నేటి నుంచి ఈనెల 20 వరకు ఆట పోటీలు నిర్వహించనున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నరేశ్, శారదా, మన్యంలు పాల్గొన్నారు.

News November 18, 2024

గ్రూప్-3 పరీక్షలో NRPT-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రశ్న

image

ఈరోజు జరిగిన గ్రూప్-3 పరీక్షల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు.? అన్న ప్రశ్న వచ్చింది. గ్రూప్-3 పరీక్షలో నారాయణపేట జిల్లా నుంచి ప్రశ్న రావడం పట్ల భారతీయ కిసాన్ సంగ్, పలువురు జలసాధన సమితి సభ్యులు, ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.