News November 16, 2024

గద్వాల: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

image

సాంబార్‌లో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి(M) పైపాడుకు చెందిన వీరేశ్ కూలీ పనులకు కర్నూలు జిల్లా గోనెగండ్ల(M) ఎన్‌గోడ్‌కు వెళ్లారు. ఆ ఊరిలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. వీరేశ్ కుమారుడు జగదీశ్(6) ఫోన్‌తో ఆడుకుంటూ సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. మూత జారిపోవడంతో సాంబారులో పడిపోయాడు. కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

Similar News

News November 17, 2024

MBNR: గ్రూప్‌-3 అభ్యర్థులకు సూచనలు..

image

✓అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ఏ-4 సైజ్‌ కలర్‌ ప్రింట్‌ తీసుకోవాలి. ✓హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అతికించాలి. ✓హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా ముద్రించకుంటే గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌తో 3పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతోపాటు, వెబ్‌సైట్‌లో పొందుపర్చిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు అందించాలి. ✓బ్లూ,బ్లాక్ బాల్ పెన్ ఉపయోగించాలి✓ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

News November 17, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో గ్రూప్‌-3 పరీక్షలు.. 154 కేంద్రాలు ఏర్పాటు

image

గ్రూప్‌-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు జరిగే పరీక్షలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 154 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఈరోజు రెండు విడతలు, రేపు ఒక విడత పరీక్ష ఉంటుంది. ఉ.8:30 నుంచి 9:30 గంటల వరకు, మ.1:30 నుంచి 2:30గంటల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

News November 17, 2024

కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం: శ్రీనివాసరెడ్డి

image

పాలమూరు నుంచే ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం ఇక్కడి నుంచే పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై కల్వకుంట్ల కుటుంబం విషం చిమ్ముతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా వారు కుట్రలు చేస్తుంన్నారని ఆరోపించారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇప్పుడే అభివృద్ధి మొదలైందని, అడ్డుకునే ప్రయత్నం చేస్తే మట్టి కొట్టుకుపోతారని విమర్శించారు.