News March 19, 2025

గద్వాలలో దారుణం..!

image

గద్వాల మండలం చేనుగోనిపల్లిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధులపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. అనాథలైన వృద్ధులపై మానవమృగాలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు గద్వాల ఆసుపత్రికి తరలించారు. కాగా వృద్ధుల్లో ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరికి మతిస్థిమితం సరిగా లేదు.. మానవత్వం మరిచి వృద్ధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. 

Similar News

News March 19, 2025

SRPT: పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

సూర్యాపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.  67 పరీక్షా కేంద్రాల్లో 11,912 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఉ. 9:30 నుంచి మ. 12:30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 67 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News March 19, 2025

కామారెడ్డి: చేపల వలలో చిక్కుకొని జాలరి మృతి

image

చెరువులో చేపలు పడుతూ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోపారం బొర్రన్న చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

News March 19, 2025

నేడే బడ్జెట్.. జనగామ జిల్లాకూ కావాలి నిధులు..!

image

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్, జనగామ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇండస్ట్రియల్ పార్కులు, పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రితో పాటు పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!