News February 12, 2025

గద్వాల్: ఘనంగా భూలక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం 

image

గద్వాల్ జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి లింగం బావిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు విగ్రహాలను లింగం బావిలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు గద్వాల్ పట్టణ ప్రజలు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

Similar News

News February 12, 2025

HYD: ఈ నెల 17వరకు నుమాయిష్ పొడిగింపు

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభమైంది. నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకులు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు భద్రత కారణాల దృష్ట్యా మొదటగా ఈనెల 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల వినతి మేరకు ఈనెల 17 వరకు అనుమతి లభించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

News February 12, 2025

సరూర్ నగర్: రేపు కబడ్డీ జట్ల ఎంపిక

image

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు రేపు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు ఎంపిక ఉంటుందని, 16 ఏళ్లలోపు బాల బాలికలు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో ఆడుతారన్నారు.

News February 12, 2025

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!

image

TG: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

error: Content is protected !!