News January 25, 2025
గద్వాల్: జిల్లా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్

గద్వాల్: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని జిల్లా అధికారులు, ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఏఓ వీరభద్రప్ప, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
8 ఏళ్లలోపు పిల్లలు ఈ ఐస్‌క్రీమ్ తినొద్దు: UK సైంటిస్టులు

రంగులు కలిపే ముద్ద ఐస్‌లను పిల్లలు ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే, గ్లిజరాల్ కలిగిన ఈ స్లష్ ఐస్‌ను 8ఏళ్ల లోపు చిన్నారులు తినడం ప్రమాదకరమని UK పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో పిల్లలు స్లషీ ఐస్ సేవించిన వెంటనే అస్వస్థతకు గురవడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని తెలిపారు. గ్లిజరాల్ వల్ల పిల్లలు స్పృహ కోల్పోతున్నారన్నారు. 8-11ఏళ్లలోపు పిల్లలు ఎప్పుడైనా ఒకటి తినొచ్చని సూచించారు.
News March 13, 2025
MNCL: క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి: CP

క్రమశిక్షణ నిబద్ధతతో కష్టపడి సరైన మార్గంలో విధులు నిర్వహించినప్పుడు గుర్తింపు వస్తుందని CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలో పనిచేస్తున్న SIలతో CP సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగత జీవితానికి, సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలన్నారు. సిబ్బందితో మాట్లాడి దర్బారు వంటివి నిర్వహిస్తూ సమస్యలు ఉంటే వారికి పెద్ద లాగా ఉండి పరిష్కరించాలని సూచించారు.
News March 13, 2025
పాడేరు: రేపు ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ఈనెల 14వ తేదీ శుక్రవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ ప్రభుత్వ సెలవు దినం పురస్కరించుకుని ‘మీకోసం’ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ‘మీకోసం’ రద్దయిన సందర్భంగా స్థానిక, స్థానికేతర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ శుక్రవారం‘మీకోసం’ కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.