News February 13, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి.. నేడు నిందితుల బెయిల్‌పై తీర్పు
టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News February 13, 2025
నిజాంసాగర్: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బుర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఎల్లారెడ్డి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన తిమ్మయ్య(48) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని కుమారుడు యేసు ప్రభు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News February 13, 2025
సంగారెడ్డి: శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి మరోసారి శిక్షణ: కలెక్టర్
నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సిబ్బంది శిక్షణకు గైర్హాజరైన వారికి మరోసారి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కాగా, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 13, 2025
16న ఢిల్లీ సీఎం ఎంపిక?
UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.