News March 21, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. కోర్టు దర్యాప్తు అధికారిణి హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణలో అధికారిపై వివరాలు కోరనుంది. 

Similar News

News March 24, 2025

మచిలీపట్నంలో నేడు  ‘మీకోసం’ కార్యక్రమం 

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో కోరారు. ఉదయం 11 గంటల నుంచి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 

News March 24, 2025

కృష్ణా: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: ఎస్పీ

image

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని నమ్మి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడవద్దని ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెట్టింగ్ యాప్స్ మోసపూరితమైన వల అని, అందులో చిక్కుకొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఐపీఎల్, టీ 20 క్రికెట్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని అమాయకులను బలి చేస్తున్నారని అన్నారు.

News March 23, 2025

కృష్ణా: బీసీ, కాపు కార్పొరేషన్ రుణ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు 

image

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్టు బీసీ కార్పొరేషన్ కృష్ణా జిల్లా ఈడీ శంకరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ, కాపు, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపులు ఈనెల 25వ తేదీలోపు AP-OBMMS ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!