News March 12, 2025

గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: KTR

image

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Similar News

News March 13, 2025

అవకాశమిస్తే రీఎంట్రీకి సిద్ధం: పుజారా

image

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెస్టు స్పెషలిస్ట్ పుజారా హింట్ ఇచ్చారు. జట్టుకు అవసరమైతే తాను ఆడేందుకు సిద్ధమని చెప్పారు. కొన్నేళ్లుగా డొమెస్టిక్, కౌంటీల్లో భారీగా పరుగులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసు‌ల్లో టీమ్ ఇండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో పుజారాను తీసుకోవాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తోంది. 2023 WTC ఫైనల్ పుజారాకు ఆఖరు మ్యాచ్.

News March 13, 2025

SVSC ఐడియా ముందుగా ఆ హీరోకు చెప్పా: శ్రీకాంత్ అడ్డాల

image

వెంకటేశ్, మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఐడియాను ముందుగా నాగార్జునకు చెప్పినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉందని చెప్పడంతో చూద్దామన్నట్లు తెలిపారు. అదే సమయంలో సురేశ్ బాబు, వెంకటేశ్ కథ విని ఒకే చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వెంకీ, మహేశ్ కాంబినేషన్ కుదిరిందన్నారు.

News March 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 13, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!