News April 8, 2025
గాంధారి: అడవిలోకి తీసుకెళ్లి దాడి.. మహిళ మృతి

గాంధారి మండలం చందాపూర్ తండాకు రాజి అనే వ్యక్తి అమీనా బేగం అనే మహిళను అడవిలోకి తీసుకెళ్లి చితక బాదాడు. అరుపులు విన్న కొంతమంది ఆమెను గాంధారి ఆసుపత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ మరణించిందని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. పోలీసుల వివరాలు.. హైదరాబాద్‌లో వారికి పరిచయం ఏర్పడిందని రాజి తన నాలుగేళ్ల బాబును ఆమె వద్ద ఉంచి వెళ్లగా ఆ మహిళా బాబును అమ్మేసిందని అనుమానంతో ఆమెపై దాడి చేశాడు.
Similar News
News April 8, 2025
MBNR: బుడియా బాపు ప్రత్యేకత (1/2)

బుడియా బాపును బంజారా ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. ఆయనను సేవ్యసాత్ అని కూడా పిలుస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గిరిజన తండాల్లో ఎక్కువగా పూజిస్తారు. బుడియా బాపు ఆలయం నల్గొండ జిల్లా రంగుండ్ల తండా గ్రామంలో ఉంది. బుడియా బాపును బంజారా ప్రజలు తమను తమ తండాలను అన్ని రకాల ఆపదల నుంచి రక్షించే దైవంగా నమ్ముతారు. ఆయనను ఆరాధించడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని,దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని వారు విశ్వసిస్తారు.
News April 8, 2025
పాలమూరు: బుడియా బాపు ప్రత్యేకత (2/2)

బుడియా బాపుకు పాలమూరు బంజారాల సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సంతానం లేని దంపతులు బుడియా బాపును భక్తితో పూజిస్తే సంతానం కలుగుతుందని గట్టి నమ్మకం. వ్యవసాయం బాగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని బుడియా బాపును ప్రార్థిస్తారు. నల్గొండ జిల్లా రంగుండ్ల గ్రామంలో బుడియా బాపు జీవ సమాధి అయ్యారని బంజారా ప్రజలు చెబుతున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారితో బుడియా బాపుకు ఎంతో అనుబంధం కలిగి ఉందని చెబుతుంటారు.
News April 8, 2025
త్వరలో బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బంగ్లాకు తిరిగివస్తానని, అవామీ లీగ్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. SMలో వారితో మాట్లాడుతూ బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజలంటే ప్రేమ లేదన్నారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చి విదేశాల్లో విలాసవంతంగా బతికారన్నారు. ఆయన అధికార వాంఛ బంగ్లాను తగలబెడుతోందని దుయ్యబట్టారు.