News March 29, 2025

గాంధారి: వడ్డీ వ్యాపారులపై కేసు

image

గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.

Similar News

News April 2, 2025

హత్య జరిగిన 36 గంటల్లో నిందితుడు అరెస్ట్: సీఐ

image

కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

News April 2, 2025

చిత్తూరులో ప్రాణం తీసిన ఫోన్ నంబర్..!

image

ఓ ఫోన్ నంబర్ వివాదం ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. ఏనుగుంట్లపల్లి హరిజనవాడకు చెందిన ఉమకు 14 ఏళ్ల కిందట వివాహం జరగ్గా.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె ఫోన్ నంబర్ పక్కింట్లో ఉండే శివశంకర్ ఫోన్‌లో ఉంది. దీనిని గమనించిన అతని భార్య సుజాత.. ఉమతో పాటు భర్తను నిలదీసింది. దీంతో మనస్థాపం చెంది ఉమ ఇంట్లోనే ఉరేసుకుంది.

News April 2, 2025

ఒంగోలులో ఇలా చేస్తున్నారా..?

image

ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు తాలుకా PS పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేయగా.. బహిరంగంగా మద్యం తాగుతూ ముగ్గురు పట్టుబడ్డారు. ఇలాగే బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

error: Content is protected !!