News August 3, 2024
గాంధీ జిరియాట్రిక్ విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు
గాంధీ ఆసుపత్రి జిరియాట్రిక్ వైద్య విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(NMC) ఉత్తర్వులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికే నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల్లో జిరియాట్రిక్ వార్డులుండగా, ఇటీవల గాంధీ ఆసుపత్రిలో వయో వృద్ధులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి గాంధీ మెయిన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.
Similar News
News January 19, 2025
HYD: రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ: కలెక్టర్లు
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు వార్డు సమావేశాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చిన 2,05,019 దరఖాస్తులను పరిశీలిస్తామని, ప్రజా పాలనలో వచ్చిన అభ్యర్థనలను కూడా పరిశీలిస్తామన్నారు.
News January 19, 2025
HYD: OYO బంద్ చేయాలని డిమాండ్
OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News January 18, 2025
HYD: సినిమాల్లో ఛాన్స్ పేరుతో లైంగిక దాడి
సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.