News January 5, 2025
గార: ఉప్పు గెడ్డలో పడి వృద్ధురాలి మృతి
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.
Similar News
News January 8, 2025
శ్రీకాకుళం: మోదీ సభా స్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అచ్చెన్న
విశాఖపట్నంలో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యవేక్షించారు. పలువురు అధికారులతో వారితో మాట్లాడి సూచనలు చేశారు.
News January 8, 2025
మకరాంపురం యువకుడికి రెండు బ్యాంక్ ఉద్యోగాలు
కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి చెందిన తమరాల అవినాశ్‌కి ఒకేసారి రెండు బ్యాంక్ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో కెనరా బ్యాంక్, ఏపీజీవీబీ పీఓ ఉద్యోగాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సాధారణ కుటుంబ నేపథ్యం గల యువకుడు ఒకేసారి రెండు బ్యాంక్ ఉద్యోగాలు సాధించడంపై కుటుంబసభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 8, 2025
ఎచ్చెర్ల: బంగారం చోరీ.. ఆపై తనఖా.!
ఎచ్చెర్ల మండల పరిధిలో వివిధ చోరీలకు పాల్పడుతున్న అనుమానితుడిని పోలీసులు విచారించగా మొత్తం కక్కేశాడు. గత నెలలో కేశవరావుపేట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో బంగారం పోయింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండు నెలల క్రితం ఫరీదుపేటలో ఓ మహిళ ఇంట్లో బంగారం చోరీకి గురవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఫైనాన్స్‌లో బంగారం తనఖా పెట్టినట్లు చెప్పాడు.