News March 4, 2025

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన జిల్లా బిడ్డలు

image

పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పెద్ది లక్ష్మణ్-గౌతమిల కుమార్తె హర్షిణి, కుమారుడు ఉజ్వల్ కరాటే విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. చెన్నైలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించింది. అందులో పాల్గొని తమ ప్రతిభతో గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్స్ సాధించారు. గిన్నిస్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు.

Similar News

News March 4, 2025

Trade War: అమెరికాపై చైనా ప్రతీకార సుంకాలు

image

ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్‌వార్ ముదురుతోంది. కెనడా, మెక్సికోకు తోడుగా అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. సోయాబీన్, పప్పులు, పోర్క్, బీఫ్, అక్వాటిక్ ప్రొడక్ట్స్, పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్ట్స్‌పై మార్చి 10 నుంచి 10% సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది. చికెన్, గోధుమలు, పత్తి సహా మరికొన్ని వస్తువులపై అదనంగా 10-15% సుంకాలు విధిస్తామని వెల్లడించింది.

News March 4, 2025

బాడీబిల్డర్ బ్రైడల్ లుక్స్ వైరల్

image

ఆమె ఓ బాడీ బిల్డర్. తన శరీరాకృతితో వందల కొద్ది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఆమే కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం. తాజాగా ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో భాగంగా వధువు గెటప్‌లో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అందరిలా సిగ్గుతో కాకుండా గాంభీర్యం ప్రదర్శిస్తూ ఫొటోకు పోజులిచ్చారు. ఎప్పుడూ బాడీ బిల్డర్ డ్రెస్సుల్లో కనిపించే ఆమె కాంచీపురం చీర, నగలతో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

News March 4, 2025

రోహిత్‌పై FatShaming: కంగనను లాగిన షమా

image

రోహిత్ శర్మ fat అని అవమానించిన కాంగ్రెస్ నేత <<15636348>>షమా<<>> మహ్మద్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. Fans, BJP నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు నటి, MP కంగనా రనౌత్‌ను మధ్యలోకి లాగారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతుగా హిట్‌మ్యాన్ ట్వీట్ చేశారు. దానికి ‘దోబీ కా కుత్తా న ఘర్ కా న ఘాట్ కా’ అంటూ విమర్శించిన కంగన రిప్లై‌ను ఆమె పోస్టు చేశారు. వీటిపై మీరేమంటారు మన్‌సుఖ్ మాండవీయ, కంగన అని ప్రశ్నించారు.

error: Content is protected !!