News August 10, 2024
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట వద్ద గల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన మెనూపై ఆరా తీసారు. వసతి గృహంలో ఉన్న స్టాకును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు.
Similar News
News January 16, 2025
నెల్లూరు: మహిళపై అత్యాచారయత్నం
ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సంగం మండలంలో చోటుచేసుకుంది. సిద్దీపురం గ్రామానికి చెందిన నాయబ్ రసూల్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై బుధవారం మధ్యాహ్నం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాజేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 16, 2025
ఆ ఇద్దరూ వీఆర్ లా కళాశాల విద్యార్థులే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా యడవల్లి లక్ష్మణరావు, హరిహరనాథ శర్మల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులు నెల్లూరులోని వీఆర్ లా కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. కర్నూలుకు చెందిన హరిహరనాథశర్మ న్యాయవాదిగా అక్కడే ప్రాక్టీస్ చేయగా, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన లక్ష్మణరావు సొంత జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలోనూ ప్రాక్టీస్ చేశారు.
News January 16, 2025
నెల్లూరు: రూ.21 కోట్ల మద్యం తాగేశారు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో మద్యం ఏరులై పారింది. కేవలం ఐదు రోజుల్లో రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. ముఖ్యంగా భోగి, కనుమ పండగ రోజుల్లో మద్యం దుకాణాల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులుతీరి కనిపించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం స్టాక్ అయిపోయినా ఏది ఉంటే అదే కొనుగోలు చేశారు.