News March 15, 2025

గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

image

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.

Similar News

News March 16, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్‌ స్కిన్) కేజీ రూ.160-180 ఉండగా.. స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.120-130 మధ్య ఉంది. కాగా, బడ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.

News March 16, 2025

వరంగల్ అమ్మాయితో అమెరికా అబ్బాయి మ్యారేజ్❤️

image

వరంగల్‌కు చెందిన అమ్మాయితో అమెరికాకు చెందిన అబ్బాయికి ఆదివారం పెళ్లి జరగనుంది. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ సంపత్- పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ ఐదేళ్ల క్రితం పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అదే కాలేజీలో చదువుతున్న గ్రాండ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో గ్రాండ్ తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. వీరి పెళ్లి వరంగల్‌లో నేడు జరగనుంది.

News March 16, 2025

వరంగల్: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

వ్యవసాయ పనులు చేసుకుని వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. శాయంపేట గ్రామానికి చెందిన రాజేందర్ (33) చింతలపల్లి రైల్వే స్టేషన్ పక్కన గల మొక్కజొన్న చేనుకు వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష అనంతరం శవాన్ని మృతుడి తండ్రి ఐలయ్యకు అప్పగించినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.

error: Content is protected !!