News March 15, 2025

గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

image

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.

Similar News

News March 17, 2025

భువనగిరి కోటపైన రోప్ వే

image

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.

News March 17, 2025

జిల్లాలో 128 కేంద్రాలు.. 26,497 విద్యార్థులు

image

పల్నాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో చంద్రకళ తెలిపారు. ఆ పరీక్షా కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 12,869 మంది రెగ్యులర్ బాలురు, 12,778 మంది రెగ్యులర్ బాలికలు ఉన్నారు.586 మంది ప్రైవేట్ బాలురు,304 మంది బాలికలు ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్నారు. 6గురు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు.

News March 17, 2025

అరిలోవ: జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

image

సెంట్రల్ జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన కేసులో భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దంపతులు శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!