News March 23, 2025

గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

image

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతి హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.

Similar News

News March 26, 2025

ప.గో: ఆ గ్రామాలను దత్తత తీసుకోనున్న పవన్..!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించి ఆర్జీలను స్వీకరించాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఈ సభలకి హాజరయ్యి ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి అర్జీలు స్వీకరిచి వాటిపై దృష్టిపెడతారు.

News March 25, 2025

‘గూడెం’ బార్ అసోసియేషన్ ఎన్నికల నగారా

image

తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్‌లో ఎన్నికల నగారా మోగింది. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో నామినేషన్ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం తెలిపారు. 26న సాయంత్రం స్క్రూట్నీ, 27న ఉపసంహరణ, 29న ఎన్నికలు జరుగుతాయన్నారు.

News March 25, 2025

ప.గో: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..!

image

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు.  అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి. 

error: Content is protected !!