News March 24, 2024

గుంటూరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

అప్పులు తీర్చినా మరింత చెల్లించాలంటూ, రుణదాతలు వేధిస్తున్నారని కొత్తపేటలోని మెడికల్ ల్యాబ్‌లో పనిచేసే కూరాకుల శివప్రసాద్(38) అనే వ్యక్తి వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో చూసిన మిత్రులు అక్కడికి చేరుకుని అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Similar News

News April 18, 2025

తెనాలి: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

image

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.

News April 17, 2025

మంగళగిరి: ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు  

image

AIIMSలో ఇక పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు, ICU విభాగం ప్రారంభమయ్యాయి. ఇటీవల మొదటి సర్జరీ విజయవంతంగా జరిగింది. 46 విభాగాల్లో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిలో రోజూ 3,500మందికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 22లక్షలపైగా రోగులకు సేవలు, 37లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. మార్చి చివరి వరకు 4.39లక్షల ఓపీ రోగులు, 42,843 ఇన్‌పేషెంట్లకు సేవలు అందించారు. 

News April 17, 2025

అమరావతిలో శాశ్వత సచివాలయానికి టెండర్‌ల విడుదల

image

అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్చిదిద్దే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ కీలక అడుగు వేసింది. నాలుగు సచివాలయ టవర్‌లు, ఒక హెచ్‌వోడీ టవర్‌ నిర్మాణానికి సంబంధించిన రూ.4,668 కోట్ల విలువైన టెండర్‌లను సీఆర్డీఏ విడుదల చేసింది. మే 1న టెక్నికల్ బిడ్లను పరిశీలించి, తుది కాంట్రాక్టర్‌లను ఎంపిక చేయనున్నారు. మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానుండటంతో, నిర్మాణాలపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వేగం కనిపిస్తోంది. 

error: Content is protected !!