News May 19, 2024

గుంటూరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

భారతీయ వాయుసేనలో అగ్ని వీర్ వాయు సైనికుల ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల శనివారం తెలిపారు. పదవ తరగతి తస్సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. ఫ్లూట్, కీబోర్డ్, పీయానో ఏదైనా సంగీత ప్రావీణ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆసక్తిగల యువకులు మే 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరించేనో?

image

మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా గుంటూరులోని అధికార పార్టీ నేతల్లో డిప్యూటీ మేయర్ ఆశావాహుల సందడి మొదలైంది. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి నాని పేరు ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయగా, డిప్యూటీ మేయర్ విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. బీసీ వర్గానికి చెందిన యల్లావుల అశోక్ పేరు గట్టిగా వినిపిస్తుండగా, ఇన్‌ఛార్జి మేయర్ సజీల మేయర్ ఎన్నిక తర్వాత పాత పదవిని కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

News April 23, 2025

గుంటూరులో రికవరీ ఏజెంట్ ఆత్మహత్య

image

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్లో ఉలవకట్టు ప్రవీణ్ దాస్ (21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే ప్రవీణ్ దాస్ మద్యానికి బానిసవ్వడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో ఉరివేసుకున్నాడని తెలిపారు. మృతుని సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

error: Content is protected !!