News June 4, 2024
గుంటూరు ఈస్ట్‌లో TDP విక్టరీ
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి నూరి ఫాతిమాపై గెలుపొందారు. మొత్తం 19 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు 99,163 ఓట్లు, నూరీ ఫాతిమాకు 67,812 ఓట్లు వచ్చాయి. దీంతో నజీర్ 31,351 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News January 3, 2025
GNT: నేటి నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. 3వ తేదీన 530 మంది అభ్యర్థులకు, 4వ తేదీన 535 మంది, 6న 536 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. 7న పురుషులకు దేహదారుఢ్య పరీక్షలు పునః ప్రారంభిస్తామన్నారు.
News January 2, 2025
గుంటూరు: కానిస్టేబుల్ అభ్యర్థుల పరుగు పోటీలలో 166 మంది అర్హత
పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పరుగు పోటీలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పోటీలలో 246 మంది అభ్యర్థులు హాజరవగా దేహదారుఢ్య, పరుగు పోటీలలో 166 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. పోటీల నిర్వహణ తీరును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News January 2, 2025
తాడేపల్లి: అధికారంలోకి రాగానే సక్రమం అయిపోయిందా : YCP
సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టపై ఉన్న అక్రమ నివాసం సక్రమం అయిపోయిందా అని YCP తన ‘X’లో పోస్ట్ చేసింది. లింగమనేని రమేష్ నుంచి ఆ ఇంటిని అక్రమ మార్గాల్లో చంద్రబాబు తీసుకున్నారని.. కానీ అద్దె చెల్లిస్తున్నట్లు మొన్నటి వరకు ఆయన కుటుంబం బుకాయించిందని రాసుకొచ్చారు. కరకట్టపై ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ నేత దేవినేని ఉమా ప్రకటించారని గుర్తు చేశారు.